Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర ఏసిపి ఆంజనేయులు
నవతెలంగాణ-ఖమ్మం
డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ మోడల్ టెస్టును అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ఖమ్మం ఏసిపి ఆంజనేయులు అభ్యర్థులకు పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ను ఏసిపి ఆంజనేయులు సోమవారం ఖమ్మం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ఈ నమూనా పరీక్షను అభ్యర్థులందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. డివైఎఫ్ఐ సంఘం మంచి ప్రయత్నం చేస్తుందని ఈ ప్రయత్నం వృథా కాకుండా అభ్యర్థులందరూ ఎక్కువ సంఖ్యలో ఈ పరీక్షలు రాసి విజయవంతం చేయాలని ఆయన అన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ఈ నమూనా పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించినట్లు, ఖమ్మంలో ఎన్ఎస్టి రోడ్లో ఉన్న నిర్మల హృదయ హైస్కూల్లో ప్రధాన ఎగ్జామ్స్ సెంటర్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ తో పాటుగా ప్రధానమైన పట్టణాలు మధిర, వైరా, సత్తుపల్లి లాంటి చోట కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 9704816603, 984927347 సంప్రదించాలనారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కూరపాటి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు రావులపాటి నాగరాజు, కొంగర నవీన్, నాయకులు కారుమంచి పవన్, రహిమాన్ ఖాన్, శ్యాం కుమార్, నాగరాజు,ఉపేందర్, అశోక్,నరేష్, షరీఫ్, గిరి తదితరులు పాల్గొన్నారు.