Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్దివో పీడీ ఎం.విద్యాచందన
నవతెలంగాణ-చింతకాని
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని డీఆర్డివో పీడీ ఎం.విద్యాచందన అధికారులకు సూచించారు. సోమవారం నాగిలిగొండ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో, భాగంగా నర్సరీని ఏవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను ఆమె, పరిశీలించారు. నర్సరీలో ఉన్న, మిగిలిన మొక్కలు ఇంటింటికి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ను ఆదేశించారు. ఏవెన్యూ ప్లాంటేషన్ మొక్కల్లో రీప్లేస్మెంట్ వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, ఎంపీటీసీ భగవాన్, ప్లాంటేషన్ సూపర్వైజర్ సుస్మిత, ఏపీఓ కోటయ్య, టెక్నికల్ అసిస్టెంట్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఐకెపిసిసి సిసి భాస్కర్, ఐకెపి వివో నస్రత్ సుల్తానా పాల్గొన్నారు.