Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
దోశపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్, సోనీ కన్ స్ట్రక్షన్స్ సాయి అంజన బజాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప గుడి కాలనీలో బియ్యం పంపిణీ చేశారు. ఖమ్మం ఏసీపీ రామోజీ రమేష్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ...ఇటువంటి విపత్కర కాలంలో గత పది రోజుల నుంచి అన్ని ముంపు ప్రాంతాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్కే టి గ్రూప్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు, దోసపాటి రాము, వి.ఎం.బంజర,్ సీఐ హనొక్, గాదె మాధవరెడ్డి, సాయి, అంజన, బజాజ్ ఆకుల శ్రీనివాస్, సోనీ కన్స్ట్రక్షన్స్ అంజద్ ఖాన్, అపోలో టైర్స్ వెంకట్, దిశ ప్రొటెక్షన్ సభ్యులు నాగుల కుసుమ, పూజల లక్ష్మి, మాధవి, ఆరిఫా, లక్ష్మి, దేవకి, ఎస్ కే టి గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.