Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఇల్లందును రెవెన్యూ డివిజన్, సుదిమల్ల, కొమరారం కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాత బస్టాండ్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య మాట్లాడుతూ ఇల్లందు మండలానికి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని, సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లందు అభివృద్ధికి నోచుకోక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో నియోజకవర్గం మూడు ముక్కలుగా తయారయిందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కొత్త మండలలను గుర్తించిందని అదే మాదిరిగా ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా గుర్తించి సుదిమల్లతో పాటు కొమరారం కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లందు అభివృద్ధి కావాలంటే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడమే ఏకైక మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, ఆలేటి సంధ్య, కూకట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.