Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగ ఉద్యోగులని కించపరిచేలా వ్యవహరిస్తున్నాడని డీఈఓకు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాశాఖలో ముసలం మొదలైంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఏడీ రామారావు ఉద్యోగులను వేదింపులకు గురిచేన్నారని, వికలాంగ ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల విషయంలో వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తు ఉద్యోలుగు కలెక్టరేట్లో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కాగా, మంగళవారం డీఈఓ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఏడిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
వికలాంగ ఉద్యోగులను వేదింపు....
జిల్లా విద్యాశాఖ ఏడి రామారావుపై 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అనుసరించి కేసు నమోదు చేయాలని టీవీపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ సతీష్ గుండపునేని, వికలాంగుల ఉద్యోగ సంఘాల అధ్యక్షులు మాలోత్ జగ్గు దాస్లు డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ ఆఫీసులో ఏడిగా పనిచేస్తున్న రామారావు వికాలంగుల ఉద్యోగులను చిన్నపు చూపు చూస్తూ చులకనగా మాట్లాడుతూ వారి పుట్టుకను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.సోమశేఖర శర్మకు వినతి పత్రం అందజేశారు. కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల ఉద్యోగ సంఘాల సహాయ కార్యదర్శి రాము, టీవీపీఎస్ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా, సాయిబాబా, మంగీలాల్, చాంద్ పాషా, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, హుస్సేన్ మియా, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.