Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ హోటల్ యజమానులతో సమావేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
వర్షకాలంలో అంటు వ్యాధులు ప్రభలకుండా ఆహార పదార్ధాల తయారీ, నిర్వహణలో పరి శుభ్రత పాటించాలని కొత్తగూడెం హౌటల్ యజమానుకు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ టి.నవీన్ కుమార్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం మునిసిపల్ కార్యక్రమంలో హౌటల్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షా కాలంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు తెలిపారు. వర్షాల కారణంగా ప్రభలుతున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర అంటు వ్యాధులను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ అనుధిప్ దురిశెట్టి ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు. ఈ కార్య్రమంలో శానిటరీ ఇన్పెక్టర్ కె. వీరభద్ర చారి, రెస్టారెంట్స్, హౌటల్స్ యాజమాన్యాలు, మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు.