Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, పలు సమస్యలు పరిష్కరించాలని మండల వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాజయ్య, మోతి రాంప్రసాద్, లాలు, లక్ష్మి, శ్రీవాణి, జమలమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు పరమ స్వామిదాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయం ముందు స్థానిక వీఆర్ఏలు నిరవ ధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. వీఆర్ఏలు నిట్ట ప్రవీణ్, కనికరత్నం, రాములు, లాలు, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మంగళవారం వీఆర్ఏల దీక్షకు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు రాములు, టీవీ ఎం. వి ప్రసాద్, ఈశ్వరరావు, తదితరులు, పాల్గొన్నారు.
ఇల్లందు : వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం వీఆర్ఏలు చేపట్టిన రెండో దీక్షను జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభం చేశారు. దీక్షలలో పుష్పరాజ్, స్వామి దాస్, రాజయ్య, పద్మ, సునీత, ఆదిలక్ష్మి, మహేష్, కాంతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నేతలు తాళ్లూరి కృష్ణ, కామ నాగరాజులు సంఘీభావం తెలిపారు.
సుజాతనగర్ : వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి డి.వీరన్న అన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టారు. చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్ మండలాలలో దీక్ష శిబిరాలను ఆయన సందర్శించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, లిక్కి బాలరాజు, నందిపాటి రమేష్, వీఆర్వోల సంఘం నాయకులు రాజు, జానీ మియా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చర్ల : క్షేత్రస్థాయిలో అనునిత్యం శ్రమిస్తున్న వీఆర్ఏల శ్రమను దోపిడీ చేయడం పాలకవర్గాలకు సరికాదని సీపీఐ(ఎం) మండల కమిటీ హితవు పలికింది. తహసీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ వీఆర్ఏ సిబ్బంది చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మచ్చ రామారావు, చంటి, నరేష, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు