Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఐటీడీఏ రోడ్డులో మంగళవారం ధర్నా నిర్వహించారు. గ్రామస్తులకు సీపీఐ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మొదటి నుంచి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్, సీపీఐ ఐదు పంచాయతీల కన్వీనర్ దారపునేని రమేష్, కొల్లిపాక శివ, బాలరాజు, పురుషోత్తపట్నం పంచాయతీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.