Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ఏపీవో జనరల్
నవతెలంగాణ-భద్రాచలం
హాస్టల్స్‌కు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గురుకులం పాఠశాల, కళాశాలలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర పౌష్టికరమైన ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్స్‌తో సమావేశమై పలు సూచనలు అందజేశారు. రుచికరంగా వంట చేస్తే, పిల్లలు ఇష్టంగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని, చదువులో ముందుండి గురుకులం పాఠశాలలు, కళాశాలలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారన్నారు. నాసిరకమైన సామాన్లు సరఫరా చేసినట్టు దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, మణుగూరు, చర్ల ప్రిన్సిపాల్లు దేవదాస్, స్వప్న కుమారి, శకుంతల, గురుకులం సెల్ ఏవో నరేందర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీదారులు పాల్గొన్నారు.