Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పగడేరు శాంతినగర్‌లో పప్పల ప్రసాద్ దళిత బందు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న పద్మశ్రీ సూపర్ మార్కెట్, శేషగిరి నగర్‌కు చెందిన బూర్గుల సంజీవరావు క్లాత్ మర్చంట్ షాప్‌ను, లంక మల్లారంకు చెందిన గంగారపు రమేష్ సూర్యచంద్ర కాటన్ విక్స్ మినీ ఇండిస్టీ షాప్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అనంతరం మర్రి మొదలు గ్రామానికి చెందిన కొమరం లక్ష్మయ్య కుటుంబానికి రూ.2,000లు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడప అప్పారావు, నవీన్ బాబు, సీనియర్ నాయకులు వట్టం రాంబాబు తదితరులు, పాల్గొన్నారు.