Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆగష్టు 1వ తేదీ నుండి జరుగనున్న 10వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పరీక్షలు నిర్వహణపై విద్యా, వైద్య, రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పోస్టల్, విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగష్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు 1968 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కూడా ఆగష్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి సంవత్సరం సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు 2385 మంది, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు 3475 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలు నిర్వహణకు 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు నిర్వహణను పర్యవేక్షణ చేసేందుకు ఫ్లెయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్న నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు డ్రాపవుట్స్ కాకుండా ఇంటర్లో చేరే విధంగా ప్రన్సిపాల్స్ లక్ష్యాన్ని కేటాయించాలని ఆర్ ఎస్ఐఓకు సూచించారు. అనంతరం ఈ సంవత్సరం జరిగిన 10, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహణ చాలా బాగా చేశారని అదే స్పూర్తితో ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్‌కు అవకాశం ఇవ్వకుండా ఈ సారికూడా అదేవిధంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ ఆఫీసర్ సులోచనారాణి, డిఈఓ సోమశేఖరశర్మ, డిపిఓ రమాకాంత్, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, పోలీస్, వైద్య, విద్యుత్, సోస్టల్ శాఖల అధికారులతో పాటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.