Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లందు రెవెన్యూ డివిజన్, సుదిమల్ల, కొమరారంను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలి
- సమస్యల పరాష్కారానికి ఆమరణ దీక్షలకు సిద్ధం
- విలేఖర్ల సమావేశంలో సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
ఇల్లందు పూర్వవైభవం కోసం రెవెన్యూ డివిజన్, సుదిమల్ల, కొమరారం నూతన మండలాల ఏర్పాటును సాధించుకుందామని సీపీఐ(ఎం) నేతలు ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక ఏలూరు భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కార్యదర్శి అబ్దుల్ నబీ, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, మండల నాయకులు ఆలేటి కిరణ్, వజ్జా సురేష్, మన్నెం మోహన్ రావు, కూకట్ల శంకర్లు పాల్గొని మాట్లాడారు. సమస్యల సాధన కోసం అవసరమైతే ఆమరణ దీక్షకు పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి పుట్టినిల్లయిన ఇల్లందును పాలకవర్గాల పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇల్లందు నియోజక వర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలోకి వెళ్లి కూడా రెవెన్యూ డివిజన్ కొత్త మండలాలు సాధించుకో లేకపోవడం బాధాకరమన్నారు. ఇల్లందు అభివృద్ధి కోసం ఆలోచించకుండా స్వ ప్రయోజనాల కోసం చూస్తున్నారని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులకు మేల్కొని ఇల్లందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, అదేవిధంగా నూతనంగా సుదిమల్ల, కొమరారం మండలాలను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ డిమాండ్ చేసింది.
అన్ని అర్హతలు ఉన్నాయి : ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
మండలం ఏడు రెవెన్యూ గ్రామాలు, ఒక మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన 29 గ్రామపంచాయతీలతో కలిపి సుమారు లక్ష జనాభా కలిగి ఉందని రెవెన్యూ డివిజన్ చేయడం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించడం తగదన్నారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఇల్లెందు నియోజకవర్గం ఈ మూడు ముక్కలుగా చేశారని, దీనివలన పాలనా పరంగా అనేక ఇబ్బందులు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంత కంటే చిన్నగా ఉన్న గ్రామాలను మండల కేంద్రంగా చేశారని ఇల్లందును రెండు మండలాలుగా చేయక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నారు. ఇటీవల కొత్తగా 13 మండలం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇల్లందు నియోజక వర్గాన్ని, ఇల్లందు మండలంను విస్మరించిందన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన, నూతన మండలాలు ఏర్పాటుకై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. భవిష్యత్తులో జరిగే ఉద్యమాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.