Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- డీఎల్సీ కార్యాలయం ముందు ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కార్మికులకు నష్ట దాయకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి. అప్పారావు, సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటితరంగా కార్మికుల సమస్యల సర్వేలో వెల్లడైన సమస్యల పరిష్కారం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న డీసీఎల్ ఆఫీస్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారికి మెమోరాండం అందజేశారు. అనంతరం సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంవి.అప్పారావు, కృష్ణయ్య మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, కార్మికులకు నష్టదాయకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 అమలు చేయాలని. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇంతటితో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, లిక్కి బాలరాజు, బిల్డింగ్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి ఉప్పుతల నరసింహారావు, జిల్లా నాయకులు గుర్రం రాములు, తోకల శ్రీనివాస్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి శేఖర్, హమాలీ యూనియన్ నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.