Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అధిక ధరలు తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, ఆహార భద్రత ప్రభుత్వ వైద్యాన్ని పటిష్ట పరచాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలని, 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆగస్టు ఒకటి నుండి సెప్టెంబర్ 5 వరకు దశలవారీగా జరిగే ఆందోళన పోరాటంలో జిల్లాలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యకాస సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.