Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాపలమడుగు నరసింహారావు ఆధ్వర్యంలో భారీ చేరికలు
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు రాందాస్ నాయక్ ఇచ్చిన పిలుపునకు వారు స్పందిస్తున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీని బలోపేతం చేసుకునేందుకు పాత నాయకులను ఆయన మళ్లీ ఆహ్వానిస్తున్నారు. దీంతో సోమవారం మీడియా రంగాన్ని విడిచి చాపలమడుగు నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో వారి అనుచరులతో సుమారు 400 మంది తన మద్దతు దారులతో చేరారు. మీడియా రంగంలో ఉన్న ఆయన భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, పొదెం వీరయ్య, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంల్సీ పోట్ల నాగేశ్వరరావు, సమక్షంలో తిరిగి సొంత గూటికి కాంగ్రెస్లో చేరుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడంకోసం వారు నిరంతరం కృషి చేస్తానని సభా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.