Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 నెంబర్ జీవో గెజిట్ చేయాలి
- అసిస్టెంట్ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు శంకర్
నవతెలంగాణ-ఇల్లందు
షెడ్యూల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం అసిస్టెంట్ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూకట్ల శంకర్ మాట్లాడారు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుండి ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం వేతన సవరణ చేయలేదన్నారు. కార్మికుల పోరాట ఫలితంగా 2021 జూన్ నెలలో 5 నెంబర్ జీవో ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఈనాటికీ గెజిట్ విడుదల చేయలేదని అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతల ఉపన్యాసాలు ఊకదంపుడు గానే మిగులుతున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం తాళ్లూరి కృష్ణ, కామ నాగరాజు, సామ్యా నాయక్, శ్రీను, పవన్ పాసి, కోటేశ్వరరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.