Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కెవిపియస్) జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ అన్నారు. నాయుడు పేట గ్రామంలో గురువారం కెవిపిఎస్ ఖమ్మం రూరల్ మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షుడు కుక్కల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం అంటరానితన నిర్మూలన కోసం కేవీపీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని వివరించారు. మోడీ అధికారం చేపట్టాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మత ప్రాతిపదికన మనుషులను విభజించేందుకు బీజేపీ సిద్ధం అవుతుందన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్య పరిచి మనువాదాన్ని ప్రవేశపెట్టడమే బీజేపీ లక్ష్యం అన్నారు. ఈనెల 30న ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్ లో నిర్వహించే కెవిపియస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని దళితులను, అభ్యుదయ వాదులను కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి పాపిట్ల సత్యనా రాయణ, నాయకులు నందిగామ కృష్ణసాగర్, ఉప్పలయ్య, రామనాధం, లక్ష్మయ్య, నాగేశ్వరరావు, రామారావు, రమణ, జానయ్య పాల్గొన్నారు.