Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతకాని : వ్యవసాయ కార్మిక సంఘం చింతకాని మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా దేశబోయిన ఉపేందర్, వత్సవాయి జానకిరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులిరువురు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి కూలీల మీద పేదల మీద భారాలేస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలి పెంచాలని కనీస కూలి చట్టం కేరళ తరహాలో అమలు చేయాలని, రోజు కూలి 400 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో కూలీలందరు ఏకమై పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచుకోవాలన్నారు.