Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండల కేంద్రంలోని ఆళ్లపాడు అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను సిపిఎం మండల కమిటీ బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సంవత్సరం పూర్తయిన్పటికీ ఇంతవరకు పూర్తిగా నిర్మాణం కాలేదని, దీనివల్ల వాహనదారులు, బోనకల్ రైతులు, ఆళ్లపాడు, రాయన్నపేట, మోటమర్రి, గోవిందాపురం (ఏ) గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు. ఆ గ్రామాల ప్రజలు బోనకల్ వెళ్లాలంటే రవాణా పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైల్వే అధికారులు కాంట్రాక్టర్ ఇప్పటికైనా స్పందించి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసే వినియోగంలోకి తీసుకొని రావాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో బోనకల్ గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయం కోసం అరకలు ట్రాక్టర్లు తీసుకొని వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉందన్నారు. తాత్కాలిక ప్రత్యామ్నాయ రోడ్డు గుండా వెళ్లాలంటే వర్షం వస్తే ఆ రహదారి గుండా వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వర్షం వచ్చినపుడు వర్షపు నీరు బ్రిడ్జి మధ్యలో నిల్వకుండా వెంటనే నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరారు. వానా కాలంలో గ్రామంలో కురిసే నీళ్లు మొత్తం బ్రిడ్జి నుండే వెళ్తాయని ఆ వర్షపు నీళ్లు వెళ్లుటకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాలువ ఏర్పాటు చేయాలని బ్రిడ్జి సైట్ ఇంజినీర్‌కు సూచించారు. కార్యక్రమంలో సిపిఎం బోనకల్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస రావు బోనకల్ మాజీ సర్పంచ్ భూక్య జాలు, సిపిఎం నాయకులు చెన్నా లక్షాద్రి, వార్డునెంబర్ ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు.