Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనఊరు- మన బడి పనుల పరిశీలన
- కారేపల్లిలో కలెక్టర్ పర్యటన
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూముల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సీరియస్ అయ్యారు. గురువారం కారేపల్లి మండలంలో కలెక్టర్ పర్యటిం చారు. ఈసందర్బంగా మత్స్యకారులు కారేపల్లి పెద్దచెరువు శిఖం ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, చెరువు శిఖం సర్వే మధ్యలోనే అధికారులు ఆపివేశారని పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తహసీల్ధార్ కోట రవికుమార్‌ను పిలిచి వివరణ అడిగారు. సర్వే తుడి దశకు చేరిందని తెల్పటంతో దానికి మత్స్యకారులు అభ్యంతరం తెలిపారు. సర్వే సగం కూడా కాలేదని కలెక్టర్ దృష్టికి తేవటంతో వెంటనే కలెక్టర్ చెరువును చూద్దామంటూ కలెక్టర్ చెరువు ప్రాంతానికి వెళ్ళారు. చెరువు శిఖంలో సాగు చేసిన పొలాలను ఆయన పరిశీలించారు. సాగు చేస్తున్న పొలాలు శిఖం భూమా అని తహసీల్ధార్‌ను ప్రశ్నించగా అవును అని తహసీల్ధార్ తెలిపారు. చెరువు భూమి 184 ఎకరాల్లో 60 ఎకరాలు ఆక్రమణకు గురైందని, చెరువు అలుగును పూర్తిగా ఆక్రమించి ఎత్తుగా మట్టిపోయటంతో కారేపల్లిలోని మందులవాడ, కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నీటి ముంపుకు గురువతున్నాయని సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మత్స్యకారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ అలుగు ప్రాంతానికి కట్టమీదిగా వెళ్ళి పరిశీలించారు.
సర్వే వారంలోపు పూర్తి చేయాలి : కలెక్టర్
చెరువు అలుగు ప్రాంతానికి వెళ్ళు మార్గంలో మట్టి రోడ్డు ఉండటంతో దీనిని ఎవరు నిర్మించారని తహసీల్ధాను కలెక్టర్ ప్రశ్నించగా, శిఖం భూమిలో రైతులే వేసుకున్నారని తెలిపారు. సర్వే చేయంది రోడ్డు శిఖంలో ఉందని ఎలా చెప్పగలరు అంటూ కలెక్టర్ ప్రశ్నించారు. అలుగు ప్రాంతంను ఆక్రమించిన రైతులు చుట్టు పెన్సింగ్ వేయటాన్ని కలెక్టర్ పరిశీలించారు. చెరువు పక్కన ఉన్నది శిఖం కాదని, తమ భూమి అంటూ కొందరు రైతులు కలెక్టర్‌కు తెలిపారు. పెద్ద చెరువు శిఖం భూమిని వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలని తహసీల్ధాన్ను కలెక్టర్ ఆదేశించారు.
మన ఊరు మన బడి పనులు పరిశీలన
కారేపల్లి మండలంలో మన ఊరు మన బడి పనులను కలెక్టర్ పరిశీలించారు. కారేపల్లి ప్రాధమిక పాఠశాలను సందర్శించి చేయాల్సిన పనులను అధికారులకు వివరించారు.తరగతి గదులు, విద్యుతీకరణ, కిచన్ షెడ్డుల పనులు చేపట్టాలని, పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. పేరుపల్లి హైస్కూల్లో ఆంగ్లబోధన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాధారంలో మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, తహసీల్ధార్ కోట రవికుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రాజారావు, సర్పంచ్‌లు అజ్మీర నాగేశ్వరరావు, అజ్మీర నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాలు చూపాలని కలెక్టర్‌కు సీపీఐ(ఎం) వినతి
కారేపల్లిలో ఇండ్ల స్ధలాలు లేని పేదలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇండ్ల స్ధలాలు చూపాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెర్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు. గురువారం కారేపల్లి వచ్చిన కలెక్టర్‌ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి కే.నరేంద్రలు కలిసి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. కారేపల్లి ప్రభుత్వం స్ధలం ఉందని, అది ఆక్రమణలకు గురవుతుం దన్నారు. దానిని ఇండ్లు లేని పేదల ఇవ్వాలని, డబల్ ఇండ్లు నిర్మించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
కారేపల్లి చెరువు వద్ద ఇరువర్గాల తోపులాట
కారేపల్లిపెద్ద చెరువు వద్ద గురువారం ఘర్షణ వాతావరణం నెలకని ఇరువర్గాలు ఒకరినొకరు తోపులాటకు దిగారు. చెరువు శిఖం ఆక్రమణలను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీ లించి వెళ్లిన అనంతరం మత్స్యకారులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుంది. ఇరువర్గాలు తిట్లు, తోపులాటకు దిగారు. తమ పట్టా భూములను శిఖం భూ ములని ఎలా చెప్పుతారని చెరువు పక్కన సాగుదారులు, మత్స్యకారులతో వాదులాటకు దిగారు. తాము సర్వే చేయమని అధికారులను కోరుతున్నామని ఆక్రమణలు అధికారులే తేల్చుతారంటూ మత్స్యకారులు అరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్ధితి నెలకొని ఒకరినొకరు నెట్టుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతున్న క్రమంలో విషయం తెలుసుకున్న సింగరేణి సీఐ అరీఫ్ అలీఖాన్ ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.