Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశువైద్యాధికారి వేణు మనోహర్రావు
నవతెలంగాణ- నేలకొండపల్లి
గొర్రెల రెండో విడత పథకం (ఎస్ఆర్డిపి) కింద గొర్రెల పంపిణీకి గొల్ల కురుమలు అవసరమైన సర్వం సిద్ధం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి వేణుమనోహర్ రావు అన్నారు. గురువారం మండలంలోని చెరువుమాదారం గ్రామంలో గ్రామ పరిధిలోని తొమ్మిది సొసైటీలలో జాబితాలో ఉన్న 519 మంది లబ్ధిదారులకు గొల్ల కురుమలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుములకు గొర్రెల రెండో విడత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గొర్రెలను మంజూరి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా లబ్ధిదారులు మరో వారం రోజులలో గొర్రెల యూనిట్లను పొందేందుకు అవసరమైన డీడీలను తీయాలన్నారు. ప్రతి లబ్ధిదారుడు తన వాటా క్రింద నలభై మూడు వేల 750 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వ సబ్సిడీ క్రింద లబ్ధిదారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జీవాలకు సంక్రమించే వ్యాధులు, నివారణ చర్యలు టీకాలు, నట్టల మందుల పంపిణీ గురించి వివరించారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు భాను చౌదరి, సొసైటీ చైర్మన్ ఎర్ర శ్రీను, చింతకాని వెటర్నరీ డాక్టర్ పి రామ్ జి, చెరువుమాదారం పశువైద్యాధికారి డాక్టర్ బి రాజు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది కే స్వరూప (జెవివో) కె కార్తీక, (ఎల్ ఎస్ ఏ) చంద్రమౌళి, (ఓఎస్) 9 సొసైటీ చైర్మన్లు లబ్ధిదారులు పాల్గొన్నారు.