Authorization
Wed April 16, 2025 03:11:41 am
- భూ పోరాటాలే ముదిగొండ
- అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదలకు భూమి దక్కే వరకూ పోరాటం నిర్వహించడమే ముదిగొండ భూపోరాట అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. స్థానిక మంచికంటి భవన్లో ముదిగొండ అమరవీరుల 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు ఎలమంచిలి రవికుమార్ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కనకయ్య మాట్లాడుతూ జానెడు జాగా కోసం పేదలు శాంతి యుతంగా ఆందోళన చేస్తుంటే నరహంతక కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా పేదలపై కాల్పులు జరిపిందని ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున భూపోరాటాలు కొనసాగుతున్న సమయంలో ఆ పోరాటాలను అణిచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి అత్యంత పాశవికంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. ముదిగొండ భూపోరాటం చేస్తున్న పేదలపై జరిపిన కాల్పులు యావత్ ప్రపంచాన్నే కలచివేసాయని ఆయన అన్నారు. ఆ తర్వాత ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో అనేక భూ పోరాటాలు కొనసాగాయని ఆయన అన్నారు. ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తు భూపోరాటాలకు సిద్ధమవుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కీ బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, కున్సోత్ ధర్మ, రేపాకుల శ్రీనివాస్, మర్మం చంద్రయ్య,ఎలమంచిలి వంశీకృష్ణ, కొండబోయిన వెంకటేశ్వర్లు, యంవి.అప్పారావు, ముదిగొండ రాంబాబు, సందకూరి లక్ష్మి, జయశ్రీ, కర్ల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.