Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి పోర్టల్ పేరుతో మోసాలు...
- కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి
నవతెలంగాణ-మణుగూరు
గుట్టమల్లారం పేదల ప్రభుత్వ భూముల సమస్యను పరిష్కరించకపోతే వారం రోజుల్లో స్వయంగా తామే ఆక్రమించుకోని పేదలకు పంచుతానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హెచ్చరించారు. గురువారం గోదావరి వరద బాధితులను పరామర్శించుటకు పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.అనంతరం గుట్టమల్లారంలో ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకోని అమ్మడానికి ప్రయత్నిస్తున్న వారిని స్థానిక ఆదివాసులను అడ్డుకోని 20 రోజులుగా మహిళలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ఆమె అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వరద బాాధితులు ఇబ్బందుల్లో ఉంటే పలకరించడానికి మనస్సురాని కేసిఆర్, ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారన్నారు. అధికారం ఉందని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే సహించేది లేదన్నారు.రాష్ట్రంలో ధరణి పోర్టల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే పోడు భూముల సమస్యను పరిష్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్కినేని .సురేందర్, డాక్టర్ శంకర్‌నాయక్, గురిజాల గోపి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వరద ప్రభుత్వ సాయం అందని ద్రాక్షేనా..
బూర్గంపాడు : గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు, సారపాక గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. గోదావరి వరదలతో సర్వం కోల్పోయి ముంపు ప్రజలు అవస్థలు పడుతుంటే ఆదుకునే వారేలేరని ఆమె విమర్శించారు. వరద బాధితులకు సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసి చాలా రోజులు అయినప్పటికీ ప్రభుత్వ సాయం అందని ద్రాక్ష వలె ఉందని అన్నారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరికి కాంగ్రెస్ నాయకులు పినపాక పట్టినగర్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యడవల్లి కృష్ణ, నియోజకవర్గ యువనేత బట్టా విజరు గాంధీ పాల్గొన్నారు.