Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భద్రాచలం
నేడు భద్రాచలం ప్రాంతంలో పర్యటన చేస్తున్న ఆంధ్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలిపే విధంగా వైయస్సార్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అందుకు సానుకూలంగా స్పందించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును మచ్చా వెంకటేశ్వర్లు కోరారు.ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా పర్యటన చేస్తూ తమ యొక్క సంఘీభావాన్ని చంద్రబాబు నాయుడు తెలియజేయటాన్ని సిపిఎం స్వాగతిస్తుందని అన్నారు. ఆనాటి తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా మీరు, మిత్రపక్షం ఎమ్మెల్యేగా అమరజీవి కుంజా బుజ్జి ఉన్న సమయంలో నిర్మించిన భద్రాచలం గోదావరిపై ఉన్న కరకట్ట నేడు పెద్ద విపత్తుగా వరదలు వచ్చినప్పటికీ భద్రాచలం ప్రాంతాన్ని కాపాడిన ఘనత మీకు దక్కుతుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం నియోజకవర్గం, పినపాక, ములుగు నియోజక వర్గాలలో గోదావరి పరివాహక ప్రాంతాలు జలమవుతాయని అందులోనూ భద్రాచలం పట్టణ ప్రజానీకంతో పాటు దక్షిణభారత అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడు సైతం మునగక తప్పని ఒక విపత్కర పరిస్థితి గోదావరి వరదల వలన సంభవిస్తున్నదన్నారు. ఇటువంటి పరిస్థితిని పరిశీలించి మీ పార్టీ తరఫున బాధ్యతగా రెండు ప్రభుత్వాల పరిధిలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణకు భద్రాచలంలో కలిపే విధంగా కృషి చేయాలని కోరారు. ఆ రకంగా తెలుగు ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఒక నమ్మకం ఉండే విధంగా మీరు త్వరగా చేయాలని మచ్చ కోరారు.