Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినాయకపురంలో భోజన వసతి...
నవతెలంగాణ-అశ్వారావుపేట
గోదావరి వరద ముంపునకు గురైన ఆంధ్రాలోని వెలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పర్యటనకు బయలు దేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అశ్వారావుపేట మీదుగా రోడ్డు మార్గంలో ఆంధ్రా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు గానూ తెదేపా స్థానిక నేతలు కట్రం స్వామి దొర,నార్లపాటి శ్రీను,అంకోలు శ్రీనివాస్ లు పార్టీ శ్రేణులు పట్టణంలో విస్త్రుత ఏర్పాట్లు చేసారు. అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలి ను పార్టీ జెండాలతో,పసుపు తోరణాలతో అలంకరించారు. ఈ కూడలిలోనే ఉన్న తెదేపా నిర్మాత ఎన్.టి.ఆర్ భారీ విగ్రహాన్ని సైతం సుందరంగా ముస్తాబు చేసి చంద్రబాబు చేత పూలమాల వేయించాలని ఉబలాట పడ్డారు. కానీ సమయాభావంతో ముంపు మండలాలు పర్యటనకు జాప్యం ఏర్పడుతుందనుకున్న చంద్రబాబు ఆ విగ్రహం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కారులో ఉండే అభిమానులకు అభివాదం చేస్తు అటుగా వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు. చింతమనేని ఆద్వర్యంలో మండల పరిధిలోని వినాయక పురం చిలుకల గండి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణంలో 2500 మందికి భోజనం వసతి కల్పించారు. చంద్రబాబు నాయుడు, అతని అనుచర నాయక గణానికి వేరే చోటు భోజనం ఏర్పాటు చేసారు. చంద్ర బాబు నాయుడు ని చూడటానికి ప్రస్తుతం వేర్వేరు పార్టీలో ఉన్న ''కమ్మ సామాజిక వర్గం'' పూర్వపు తెదేపా నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం కొసమెరుపు.
చంద్రబాబుకు స్వాగతం
దమ్మపేట :దమ్మపేట మండలం ముద్దులగూడెం స్టేజి వద్ద ముంపు గ్రామాల పర్యటన నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటన నిమిత్తం వెళుతున్నా మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుకి మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు చెన్నారావు, గడ్డిపాటి సత్యం, స్టాలిన్, ఎండి వాలి భాష ఉన్నారు.