Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పీఆర్ పనుల పురోగతిపై గురువారం సమీక్ష నిర్వహించారు. వివిధ గ్రాంట్ల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. సిఎస్ఆర్ గ్రాంట్ కింద జిల్లాలో 276 పనులు చేపట్టగా 247 పనులు పూర్తయినట్లు, 7 ప్రగతిలో ఉండగా, 33 పనులు త్వరలో ప్రారంభం అవుతాయని వివరించారు. సిడిపి గ్రాంట్ కింద 772 పనులు చేపట్టగా 614 పనులు పూర్తి కాగా, 28 పురోగతిలో, 130 పనులు ఇంకా ప్రారంభించలేదని అన్నారు. డిఎంఎఫ్టీ కింద 421 పనులకు గాను, 394 పూర్తి కాగా, 6 పురోగతిలో ఉండగా, 21 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఎస్టిఎఫ్ కింద 2509 పనులకు గాను 192 పూర్తయినట్లు, 66 పనులు కొనసాగుతుండగా, 251 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీఎంజిఎస్ వై, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎంపీలాడ్స్ తదితర గ్రాంట్ల కింద మంజూరయిన పనుల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. పురోగతిలో ఉన్న పనులపై ప్రత్యేక దష్టి సారించి రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రారంభించని పనులను త్వరగా మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ జె.సుదర్శన్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, ఖమ్మం సత్తుపల్లి పిఆర్ ఈఈలు కె.శ్రీనివాస్, చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, పిఆర్ డీఈలు శివగణేష్, వెంకటరెడ్డి, చంద్రు, కోటేశ్వరరావు, నళిని మోహన్, రాంబాబు, ఏఇఇ లు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో
ప్రసవాలు పెంచాలి : కలెక్టర్
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెలలో (జులై 2022) ఎక్కువ ప్రసవాలు చేసిన వైద్యాధికారులను కలెక్టర్ గురువారం తన చాంబర్ లో సత్కరించారు. మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు. ఎంవి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. జి. శ్రీదేవి 11, బనిగండ్ల పాడు వైద్యాధికారి డా. జి. రాజు 11, తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. సిహెచ్. జ్యోతి 13 ప్రసవాలు చేశారని కలెక్టర్ అభినందిం చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దవాఖా నాల వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో కావాల్సిన సదుపా యాలు, పరికరాల గురించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. రాంబాబు, పీవో ఎంసీహెచ్ డా. సైదులు, ప్రోగ్రాం అధికారిణి డా. నిలోహన ఉన్నారు.