Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛలో పార్లమెంట్ మహా ధర్నాలో
- పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంగన్వాడి సిబ్బంది
నవతెలంగాణ-కొత్తగూడెం
ఐసీడీఎస్ కింద పని చేస్తున్న మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని మెయిన్ టీచర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన చలో పార్లమెంట్ మహా ధర్నాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. మహా ధర్నాలు సిఐటియు అఖిలభారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ హేమలత తపన్ సేన్ అంగన్వాడి ఫెడరేషన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సింధు ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరించే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి హాజరైన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు నాయకత్వం వహించిన యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. పద్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ మాట్లాడారు. ఈ మహా ధర్నాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ రవికుమార్, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎం.విజయశీల, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, రమ్య, దమ్మపేట సూరమ్మ, మంగ, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.