Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
- ముంపు గ్రామాల ప్రజలకు నిత్యవసరాలు అందజేత
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదలతో నీట మునుగుతున్న గ్రామాలకు శాశ్వత పరిష్కారం దిశగా తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి అపన్న హస్తం అందిస్తామని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ముంపు గ్రామాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. గురువారం మండలంలోని గోదావరి ముంపు గ్రామాలైన బైరాగులపాడు, ఆంద్రకేసరి నగర్, వర్క్ షాపు, కన్నాపురం, బుర్రవేముల, దంతెనంతో పాటు పలు గ్రామాల ప్రజలకు నిత్యవసరాల బ్యాగ్స్ ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదలతో ముంపు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి పనులు లేక పస్తులు ఉంటున్నారని వారికి ఆపన్న హస్తం అందించి వారికి ఒక్క పూట అయినా కడుపు నింపాలనే ఉద్దేశంతో నిత్యవసరాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్, మండల అద్యక్షులు లంకా శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షులు చింతిర్యాల రవికుమార్, తోటమళ్ల సంగీతరావు, తెల్లం నరేష్, వేణు, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం : పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి
గోదావరి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకిë ఆరోపించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అందజేసిన నిత్యవసర సరుకులను పంచాయతీ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ, వాగె రాజేశ్వరి, ధనగం రఘుముల్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
మణుగూరు : మణుగూరు, పినపాక మండలాల లయన్స్‌క్లబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ప్రెసిడెంట్ రాధాకృష్ణ తెలిపారు. గురువారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎల్సిఐఎఫ్ వారు 8 లక్షలు (పదివేల డాలర్లు) గ్రాంట్‌గా అందజేయడం జరిగిందన్నారు. సుమారు 14 లక్షల రూపాయలతో( ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్విన్నింగ్ ప్రోగ్రాం) 900 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, వంటపాత్రలు, బ్లాంకెట్స్ తదితర అవసర మైన సామగ్రితో కూడిన సరుకులను అందజేశారు. అనంతరం లయన్ ప్రభాకర్ రెడ్డి యరాల పర్యవేక్షణలో 450 కిట్లను పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తీగల మోహాన్‌రావు, హరీష్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, శివప్రసాద్,పినపాక ప్రెసిడెంట్ గంగిరెడ్డి. సతీష్ రెడ్డి, లయన్స్ క్లబ్ మణుగూరు లెజెండ్స్ ప్రెసిడెంట్ దయానిది. వసంత చార్యులు పాల్గొన్నారు.