Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో వచ్చిన వరదల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు 40 వేల ఎకరాలు వివిధ పంటలు నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని, వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు ప్రభుత్వం సరఫరా చేయాలని, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మంచి కంటి భవన్లో ఎలమంచిలి రవికుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీలో సమావేశంలో ధర్మా మాట్లాడుతూ, జిల్లాలో పత్తి, వరి, పెసర, మినుము వంటి పంటలు వరదలకు పూర్తిగా దెబ్బతిని పోయాయన్నారు. ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేలు ఖర్చు చేశారని తెలిపారు. జిల్లా మొత్తం 70 నుంచి రూ.80 కోట్లు రైతన్నలు నష్టపోయిందన్నారు. పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పొటాషియం లాంటి ఎరువులలో ఇసుకను కలిపి అమ్ముతున్నారని, దీంతో బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఎరువుల పైన ప్రత్యేక దర్యాప్తు చేసి నాసిరకం ఎరువులను అమ్ముతున్న వ్యక్తుల పైన చట్టపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కొక్కిరపాటి పుల్లయ్య, సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ, ఊకంటి రవికుమార్, కొండ బోయిన వెంకటేశ్వర్లు, భుక్యా శంకర్, కుడుముల శ్రీకాంత్, కేశవరావు, సూర్యనారాయణ, వంశీ కృష్ణ, సూర్యచంద్రరావు పాల్గొన్నారు.