Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీ సెల్ మహిళా నాయకురాలు, పర్ణశాల సర్పంచ్ వరలకీë
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి వరదలతో ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మహిళా నాయకురాలు పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకీë రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడారు. వరద ముంచెత్తిన గ్రామాలను నేటికి బురదమయంగా ఉన్నాయని రహదారులపై వంటా వార్పు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధిక, వర్షాలు గోదావరి వరదలతో జరిగిన నష్ట పూడ్చ లేనిది అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.10 వేల ఇంటి చుట్టు చేరిన ఒండ్రు, మట్టి చెత్తా చెదారం తొలగించడానికి కూడా సరిపోవు అన్నారు. ముంపు గ్రామాల్లో నిత్యం శానిటేషన్ పనులతో పాటు వైద్య శిభిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.లక్షతో పాటు ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వరద భాదిత కుటుంబాలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వారిని అన్ని విదాలా ఆదుకోవాలన్నారు.