Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోదకాలుతో ఇంటికే పరిమితం
- రూ.2 లక్షల ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-ములకలపల్లి
ఓ పంచాయతీకి మాజీ ప్రజాప్రతినిధి తన కుమార్తె బోదకాలు, అనారోగ్యంతో తనకున్న దానిలో ఇంతవరకు వైద్యానికి ఖర్చుచేశాడు. తనకున్న రెండు ఎకరాల జామాయిల్ తోటతో పాటు భూమిని సైతం అమ్మాడు. అయినా ఆమె జబ్బు మాత్రం నయంకాలేదు. అతని కుమార్తె కూడా విద్యలో దిట్ట ఏం లాభం తనకున్న వ్యాధితో ఏంచేయలేక ఇంటి వద్దే ఉంటోంది. దాతల ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తోంది. వివరాలిలా ఉన్నాయి... మండల పరిధిలోని పాత గుండాలపాడుకు చెందిన మా సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు, సాయిత్రిల కుమార్తె మానస ఇంటర్ ఎంపీసీలో 691 మార్కులు సాధించింది. 2018లో ఎడమకాలు నరాలు కలవకపోవడంతో బోదకాలుగా మారింది. దీనికి వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బుతో పాటు ఉన్న భూమిని, జామాయిల్ తోటను సైతం అమ్మి పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించాడు. అయినా వ్యాధి నయం కాలేదు. ఖమ్మం, హైదరాబాద్, తమిళనాడు, కేరళ ఇలా ప్రతిచోటకు వెళ్లి ఇప్పటివరకు రూ.6 లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించినా ఫలితంలేదు. చివరకు హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ హాస్పటల్లో చేర్పించగా అక్కడ వైద్యులు రూ.2 లక్షలు అవుతాయని చెప్పడంతో అప్పటికి ఉన్నదంతా ఖర్చుచేసిన వారికి ఏం చేయాలో తోచక దాతల ఆర్ధికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా వైద్యానికి సాయం చేస్తే ఆమెకు నయం అవుతుందని, సాయం కోసం చూస్తున్నామని, సాయం చేసే దాతలు పూర్తి వివరాలకు 816652047 నెంబరు సంప్రదించాలని మానస తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.