Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 2021 జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాలు జీవో 22 ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయాలని, తక్షణమే తెలంగాణ ప్రభుత్వం గెజిట్ చేసి అమలు చేయాలని, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీన హైదరాబాదులో తలపెట్టిన ధర్నాలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య పిలుపు నిచ్చారు.
ఆదివారం కొత్తగూడెంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశం సూరం ఐలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 22ను డిజిట్ చేసి పెరిగిన వేతనాలు సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ సాధనకై భవిష్యత్తులో కూడా దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.చంద్రశేఖర్, ఏ.ప్రభాకర్, కిషన్,సైదమ్మ, రాణి, ఎస్.లెనిన్, ఫాతిమా, బనిగి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.