Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టు పరిశుభ్రంగా ఉంచుకొని, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పట్టణ పరిశుభ్రతలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం 1వ వార్డ్ పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో మనకోసం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలకుండీలలో ఉన్న నిలువ నీటిని తీసివేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వారానికి రెండుసార్లు శుక్రవారం ఫ్రైడే-డ్రైడేగా, ఆదివారం మనకోసం-మనం పేరిట నిలువ నీటిని తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కత్తుల లక్ష్మణరావు, జవాన్లు గడ్డం రమణయ్య, యాసీన్, జొన్నాడ రమేష్, గంగపూరి వెంకటేశ్వర్లు, ఊటుకూరి ప్రవీణ్, భరత్, ముఖేష్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.