Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను బూర్గంపాడు జడ్పీటీసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత-కామిరెడ్డి రామ కొండారెడ్డిలు పరామర్శించారు. మంత్రి తల్లి గుగులోతు దస్మా అనారోగ్యం ఇటీవల మరణించడంతో ఆదివారం వారి నివాసానికి వెళ్లి మంత్రిని పరామర్శించి, సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వంశీ కృష్ణ, తాళ్లూరి శ్రీహరి బాబు, తూము రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.