Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొన్న భద్రాచలం మండలంలో
- నిన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో
- సండ్ర ఆధ్వర్యంలో పలు వితరణలు
నవతెలంగాణ-సత్తుపల్లి
తన ప్రాంతం కాదు.. తన నియోజకవర్గం కానేకాదు. అయినా ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ పలు విధాలుగా గోదావరి వరద బాధితులకు తనదైన శైలిలో సాయం అందిస్తున్నారు. మొన్న భద్రాచలం మండలం దుమ్ముగూడెం మండలంలోని ఎల్ఎన్రావుపేట, రేగుబల్లి, సున్నంబట్టి, వర్క్‌షాప్ గ్రామాల్లోని 400 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు, వంటపాత్రలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. నిన్న (ఆదివారం) ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దస్తులు అందించి గిరిపుత్రుల అభిమానాన్ని చూరగొన్నారు.
వేలేరుపాడు మండలం రుద్రంకోటకు చెందిన ఆదివాసీల ఇండ్లు వరదలకు చిన్నాభిన్నం అయ్యాయి. వరదలు తగ్గినా వాటిని బాగుచేసి వెళ్దామనుకున్నా మళ్లీ వరదలు రావనే గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆదివాసీ ప్రజలకు సాయం అందించాలనే తలంపుతో ఎమ్మెల్యే సండ్ర వారుంటున్న గుట్ట ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లారు. వారితో మాట్లాడారు. నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు అందించి భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు సండ్ర తెలిపారు. తమ కోసం ఎక్కడినుంచో వచ్చి సహాయం చేస్తున్న ఎమ్మెల్యే సండ్రకు ఆదివాసీలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్ మట్టా ప్రసాద్, నాయకులు వల్లభనేని పవన్, గోగులమూడి బాలాజీరెడ్డి, కొండపల్లి రమేశ్‌రెడ్డి, మిత్రా ఫౌండేషన్, వేంసూరు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.