Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఏఐకేఎస్‌సీసీ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఫహిద్ ఉద్ధం సింగ్ వర్ధంతి రోజున బస్టాండ్ సెంటర్లో మోడీ విద్రోహ చర్యలు నిరసిస్తూ నిరసనగా దిష్టి బొమ్మను దహనం చేసినట్టు ఏఐకేఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మా, (న్యూడెమోక్రసీ) అనుబంధం ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్‌లు తెలిపారు. ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో దిష్టిబొమ్మ దహనం అనంతరం వారు మాట్లాడారు. ఏడాది పాటు రైతాంగం పోరాడిన ఫలితంగా దిగివచ్చిన కేంద్ర సర్కార్ మూడు నల్లవ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడం జరిగిందన్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర నిర్ణయించే చట్టం తెస్తామని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు రద్దు చేస్తామని, లఖింపురి ఖేరి ఘటనకు బాధ్యుడైన అజరు మిశ్రా టోనీ కేంద్ర మంత్రిపై చర్యలు చేపడతామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. తూతు మంత్రంగా వేసిన ఎంఎస్పి కమిటీలో ప్రభుత్వానికి అనుకూలమైన వారిని రైతులకు వ్యతిరేకమైన వారిని వేయటం తో రైతు సంఘాలు తిరస్కరించడం జరిగిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి ఉద్యమానికి సమాయత్తం అవుతామని వారు హెచ్చరించారు. అగ్నిపథ్ వ్యతిరేకిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నిదానంతో ఆగస్టు 7 నుండి 14 వరకు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. లఖింపురి కేరి ఘటనకు బాధ్యుడైన అజరు మిశ్రా టోనీని మంత్రివర్గం నుండి తొలగించనందుకు నిరసనగా లఖింపురి కఖేరీలో 50 గంటల నిరసన ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా నాయకులు శంకర్, వాంకుడోత్ కోబల్, కొండబోయిన వెంకటేశ్వర్లు, బాలు, వెంకటేశ్వర్లు, షణ్ముక్, గండమాల భాస్కర్, జగన్, నగేష్, వెంకన్న, రాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంధా, సీపీఐ (ఎం), సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు కల్లూరి కిషోర్, ముదిగొండ రాంబాబు, కుంజా కృష్ణ, ఇంటి లక్ష్మిలు మాట్లాడుతూ కేంద్రం గిట్టుబాటు ధరకు చట్టబద్ధ కల్పించామని చెప్పి ఇప్పుడు మాట దాటవేస్తుందన్నారు. అనంతరం ములకలపల్లి సెంటర్లో కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊకంటి రవికుమార్, వై.రామారావు, ఎల్.లక్ష్మినర్సయ్య, రాంబాబు, లక్ష్మి, వి.శ్రీరాములు, సున్నం రామన్న, ఎన్.మధు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అప్ప చెప్పేందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని రైతు సంఘాల నాయకులు గడ్డం సత్యనారాయణ, ప్రభాకర్ అన్నారు. ఆదివారం రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కనీస మద్దతు ధరలు చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తగరం జగన్నాథం, కంగాల కల్లయ్య, వాసం బుచ్చి రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.