Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోసియేషన్ గౌరవ సలహాదారుగా ''మడిపల్లి''
నవతెలంగాణ-అశ్వారావుపేట
జర్నలిస్టులు ప్రజలకు, పాలకులకు సామాజిక వారధులుగా ఉంటూ, సమాజానికి మేలు చేసేలా ఉండాలని స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. స్థానిక గిరిజన భవన్లో ఆదివారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధమ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క జర్నలిస్టు మీడియా విలువలను పెంచేలా పని చేయాలని, నిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులు కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, వాటిని పరిష్కరించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీను ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇందులో ఈ అసోసియేషన్‌కు గౌరవ సలహాదారుగా నవతెలంగాణ విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులుగా ఎస్,కె మౌలాలి (సాక్షి), కొల్లి రవికిరణ్ (టివి 9)లు నియమితులు అయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా మద్దాల వాసు (సాక్షి టీవీ), అధ్యక్షుడిగా మట్లకుంట చంద్రశేఖర్(ఆంధ్రప్రభ), ఉపాధ్య క్షుడిగా ఎండి ముజాఫర్ ఖాన్(సాక్షి,రూరల్), ప్రధాన కార్యదర్శిగా సంక్రాంతి సతీష్ (హెచ్ఎం టీవీ), కోశాధికారిగా కేశిబోయిన వీరాంజనేయులు (టీ మీడియా), సహాయ కార్యదర్శులుగా తాళం ధర్మ లింగేశ్వరరావు (జై తెలంగాణ టీవీ), యర్రపాటి సతీష్ (సూర్య), ప్రచార కార్యదర్శిగా ఇస్లావత్ వినోద్ కుమార్(జీ న్యూస్), కంచర్ల సాయి (6టీవీ), యశోధ రోహిణి (స్టూడియో ఎన్), రమణం సత్యనారాయణ, జంగం ఆంజనేయ ప్రసాద్, కనుమూరి శ్యామ్సన్, పరమేశ్వర్, బత్తుల రాము, చిన్న శేషు, శ్యామ్ ఏన్నికైయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ అట్టం రమ్య, సీఐ బాలకృష్ణ, ఎక్సైజ్ సీఐ నాగయ్య, ఎస్సై చల్లా అరుణ, డాక్టర్ అనుదీప్, ఉద్యమ కారుడు ఎస్కే ముబారక్ బాబా, ఎంటీ పీసీ సభ్యులు వేముల భారతి, సత్యవరపు తిరు మల, నాయకులు మందపాటి మోహన్‌రెడ్డి, కట్రం స్వామి దొర, చిన్నంశెట్టి వెంకటనరసింహాం, సంపూర్ణ, నార్లపాటి శ్రీను పాల్గొన్నారు.