Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
- రైతు విద్రోహ దినం సందర్భంగా ఖమ్మంలో రైతుల నిరసన
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు చట్టబద్ధత కల్పించాలని, కేంద్ర మంత్రి వర్గం నుంచి హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా జాతీయోద్యమ వీరుడు ఉధ్ధం సింగ్ వర్థంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రైతు విద్రోహ దినం పిలుపు మేరకు ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, అఖిలభారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రైతు విద్రోహ దినం సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవసాయ రంగంను కార్పోరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చాకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు చట్టబద్ధతకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో 26 మందికి గాను 23 మంది రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను సమర్ధించారని గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల కమిటీని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేటీకరణ విధానాలు, అగ్ని పథ్ నిరసిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ నెల 7 నుంచి 14 వరకు విస్తృత ప్రచారం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఎస్కె మీరా, తోట వెంకటరెడ్డి, సుంకర సుధాకర్, దొంగల తిరుపతిరావు, శివలింగం, బందెల వెంకయ్య, వెంకట్రామిరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రావు, గుర్రం కృష్ణయ్య, యనమద్ధి రామకృష్ణ, ఖాసిం, లక్ష్మణ్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, జానకి, మంగతాయి తదితరులు పాల్గొన్నారు.