Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదు అనే పరిస్థితి నుంచి కమ్యూనిస్టులు లేకుండా భారతదేశానికి భవిష్యత్తు లేదనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం రెండవ రోజు జరిగాయి. ఈ శిక్షణ తరగతులకు పిల్లలమర్రి వెంకట అప్పారావు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. వర్తమాన పరిస్థితులు - పార్టీ డాక్యుమెంట్ అనే అంశాన్ని పొన్నం వెంకటేశ్వరరావు బోధించారు. ప్రపంచంలో మొట్టమొదటగా సోవియట్ రష్యాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. 2008లో మొట్టమొదటగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. ఈ సంక్షోభం రింగులాగా తిరుగుతూనే వస్తువు పోతూ ఉంటుందని ఆనాడే మార్చిస్ట్ మేధావి కారల్ మార్క్స్ స్పష్టం చేశారన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు గడగడలాయని అన్నారు. కానీ కమ్యూనిస్టు దేశాలు కరోనా ను నిర్మూలించడంలో అగ్రభాగాన ఉన్నాయన్నారు. కమ్యూనిస్టు దేశాలలో వైద్యరంగం ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల ఇది సాధ్యమైంది అన్నారు. భారతదేశం పేదరికంతో విలవిలలాడుతుందన్నారు. దీనకి కారణం మన పాలకులేనన్నారు. పార్టీ కర్తవ్యాలు అనే అంశాన్ని బోనకల్, చింతకాని సిపిఎం మండల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, మడిపల్లి గోపాల్ రావు బోధించారు. కమ్యూనిస్టుల కర్తవ్యం దోపిడీ లేని సమాజం నిర్మించటమేనని అందుకు సిపిఎం శ్రేణులు సైనికుల పనిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సిపిఎం అభివృద్ధికి కృషి చేయాలని అదేవిధంగా ప్రజా సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ తరగతులలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత, ఆళ్ల పుల్లమ్మ, బంధం వెంకటరాజ్యం, కర్లకుంట దేవమణి, గుడ్డూరి ఉమ, తుళ్లూరు రమేష్ సిపిఎం మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు, ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.