Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్ర వ్యాప్తంగా ''శౌర్య యాత్ర'' పేరుతో తెలంగాణ సాయుధ పోరాటయోధులకు త్యాగాలను స్మరిస్తూ ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వేముల ఆనంద్, కట్ట నరసింహ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో
ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సమావేశాలు రెండు రోజు సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తర వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను స్మరిస్తూ పేరెన్నిక గల అమరుల గ్రామాలను సందర్శిస్తూ ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర పేరుతో వారి త్యాగాలను స్మరిస్తూ ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాట ఘట్టాలు జరిగిన ప్రాంతాలన్నింటిని సందర్శిస్తూ వారి త్యాగాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఆటపాటలతో పాటు సాయుధ పోరాట ఘట్టాలతో కూడిన వీర తెలంగాణ నాటిక ప్రదర్శిస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వేముల సదానంద్, వేల్పుల వెంకన్న, ఎంజె వినోద్ కుమార్, కళ్యాణ్, భాస్కర్, గౌతమి వివిధ జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు బూర్గుల ప్రభాకర్, ముత్యాలు నామ లక్ష్మీనారాయణ, రత్న కుమార్, యాదగిరి, సమ్మయ్య, జిల్లా నాయకులు నందిగామ కృష్ణ, ఉపేందర్, వేగినాటి తదితరులు పాల్గొన్నారు.