Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు
- మల్లెంపాటి వీరభద్రం, ప్రముఖ వైద్యులు కే. మోహనరావు
- వైరాలో మోడల్ కానిస్టేబుల్ పరీక్ష విజయవంతం
- డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్
నవతెలంగాణ - వైరా టౌన్
మోడల్ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు డివైయఫ్ఐ చేస్తున్న కృషిి అభినందనీయమని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లెంపాటి వీరభద్రం, ప్రముఖ వైద్యులు కుదురుపాక మోహన్ రావు అన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షను స్థానిక వైరా మధు జూనియర్ కళాశాలలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. మోడల్ పరీక్ష పేపర్ ఆవిష్కరణ కార్యక్రమం డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి షేక్.నాగుల్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్లెపాటి వీరభద్రరావు, కుదురుపాక మోహన్ రావు మాట్లాడుతూ దేశంలో యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు డివైయఫ్ఐ చేస్తున్న కృషి అభినందనియమని అన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు మంచి స్పందన వచ్చిందని, పరీక్ష విజయవంతానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కనపర్తిగిరి, షేక్ రోషన్ బేగ్, అబ్జల్, సుజాత, కిషోర్, నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.