Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోడల్ కానిస్టేబుల్ పరీక్షను ఖమ్మం టౌన్ లో స్థానిక నిర్మల్ హృదయ హైస్కూల్లో ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్, స్కూల్స్ కరెస్పాండెంట్ సాంబశివరెడ్డి, బివికే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి శివ నారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్ కానిస్టేబుల్ పరీక్ష అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుందని, ఈ పరీక్ష రాయడం ద్వారా అభ్యర్థులకు నమూనా అర్థమయి ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చని ఆయన అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగ సాధించడం అంటే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతని, ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీస్ వ్యవస్థని ఆయన అన్నారు. అందుకే పోలీసులుగా వస్తున్న వాళ్లు సమాజ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలని అని పిలుపునిచ్చారు. నిర్మల హదయ స్కూల్స్ కరెస్పాండెంట్ సాంబశివరెడ్డి, బి వి కే జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి, శివన్నారాయణ మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్ పరీక్ష ప్రభుత్వం నిర్వహించే మోడల్ పరీక్షలు గీటుగా ఉందని వారు అభినందించారు. డివైఎఫ్ఐ చేస్తున్న పోరాటాలు త్యాగాలు మరియు సందర్భంగా గుర్తు చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు విశేష ఆదరణ వచ్చిందని, జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది సెంటర్లో రెండువేల కు మంది పైగా అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారని వారి సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శీలం వీరబాబు, భూక్య ఉపేందర్ నాయక్, గుమ్మ ముత్తారావు, సహాయ కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, కొంగర నవీన్, జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణ, టాటా రాజేష్, కారుమంచి పవన్, సాయి, శ్యామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్షకు విశేష స్పందన
నవతెలంగాణ మధిర
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షను మధిర టౌన్లో తేళ్ళ వసంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత హైస్కూల్లో ప్రముఖ న్యాయవాది దిరిశాల జగన్మోహనరావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రావిరాల లక్ష్మణరావు, ఎంఈఓ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్ కానిస్టేబుల్ పరీక్ష అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు విశేష ఆదరణ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామిశేటి సురేష్, రావులపాటి నాగరాజు, ఎస్కే సైదులు, దివ్వల వీరాంజనేయులు, గద్దల ఆనంద్ పాల్గొన్నారు.