Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-బూర్గంపాడు
గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన వరదబాధితులను, రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి వరదబాధితుల పరిస్థితిని అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఆయన బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణమే రూ.10,000 అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేటికీ అందజేయక పోవడం శోచనీయమని ఆయన అన్నారు. వరద బాధితుల పక్షాన బీఎస్పీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యప డొద్దు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర, జిల్లా కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి కెవి రమణ, జిల్లా కార్యదర్శి పాక వెంకటేశ్వర్లు, నియోజ కవర్గ అధ్యక్షుడు ఇరప రవికుమార్, మండల అధ్యక్షుడు ఇసంపల్లి నరహరి, జిల్లా ఇన్చార్జి కామరాజు, ఈసీ మెంబర్ కేసుపాక కృష్ణ, భద్రాచలం, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు వీరస్వామి, ప్రతాప్, నాగుల రవికుమార్, మణుగూరు, అశ్వాపురం మండలాల అధ్యక్షులు రఘు, రంగబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్
పాల్వంచ సీఎం కేసీఆర్ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు . పాల్వంచ పట్టణ పరిధిలోని పూర్ణ టీ స్టాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలతో మధ్యపెట్టడమే గాని హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. గోదావరి వరద బాధితులకు రూ.1000 కోట్లు ప్రకటించి ఇప్పటికే చిల్లిగవ్వ ఇవ్వలేదని అన్నారు. బీఎస్పి ఆధ్వర్యంలో నిరుపేదలకు వరద బాధితులకు సుమారు వెయ్యి మందికి నిత్యావస రాలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్, స్వేరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకబత్తిని వీరయ్య, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు హరిబాబు, బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, వీరు నాయక్, రాజేందర్, రవి, శరత్ తదితరులు పాల్గొన్నారు.