Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
పట్టణ అభివృద్ధిలో భాగంగా కిన్నెరసాని రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం పాత పాల్వంచలోని వనమా నివాసంలో వ్యాపారస్తులు, ఆర్అండ్బి మునిసిపల్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనే వ్యాపారస్తులతో మాట్లాడుతూ కిన్నెరసాని రోడ్డు విస్తరణ పనులను సుమారు రూ.5కోట్లతో చేపట్టనున్నమని, దానిలో వ్యాపారస్తులు రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నారని, నిబంధనల మేరకు అధికారులు చెప్పిన విధంగా తొలగించాల్సి వస్తుందని అన్నారు. ఈ కిన్నెరసాని రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ దాటి ఉన్న అన్యక్రాంతాలను వెంటనే తొలగించాలన్నారు. కిన్నెరసాని రోడ్డు విస్తరణ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
పాల్వంచ పట్టణాన్ని సుందర మయంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని అన్నారు. రామవరం నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. వందల కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఆర్అండ్బి డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, డీఈ మురళి, పెద్దమ్మ గుడి డైరెక్టర్లు ఆచార్యులు, చింతా నాగరాజు, కాంట్రాక్టర్లు సాయిబాబు, శ్రీనివాస్ రెడ్డి, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు.