Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ డాక్టర్ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 8వ విడతలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఐదు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. జులై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజులపాటు నిరంతరాయంగా జరిపిన తనిఖీల్లో 67 మంది బాల కార్మికులను గుర్తించడం జరిగిందని ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. 55 మంది బాలురు, 12 మంది బాలికలను సంరక్షించి 54 మంది వర్తకులు, వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లాంటి కార్యక్రమాలతోనే కాకుండా చదువుకు దూరమై, వివిధ రకాల పనులు చేసుకుంటూ చిన్న వయసులోనే కష్టాల పాలవుతున్న బాలలను గుర్తించి వివిధ శాఖల సమన్వయంతో వారిని సంరక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్-8నకు నోడల్ అధికారిగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్, ఇంచార్జిగా పని చేసిన ఇన్ప్క్టర్స్ వెంకటేశ్వర్లు, ఆపరేషన్ ముస్కాన్ బృందాలను అభినందించారు.