Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8వ రోజు వంటావార్పు
నవతెలంగాణ-కొత్తగూడెం
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు వారు చేస్తున్న నిరవధిక సమ్మె దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వీఆర్ఏలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వంటా వార్పు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు సీనియర్ అసిస్టెంట్ ధనియాల వెంకటేశ్వర్లు, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఆర్ఐ సూర్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ సిరాజ్, వీఆర్ఓలు శివ, సతీష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పాలించే మండల అధ్యక్షులు కత్తుల రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం 8వ రోజు నిరవధిక సమ్మె నిరసన దీక్షకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపి, మాట్లాడారు. వారి సమస్యల పరిష్కార పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ములకలపల్లి : వీఆర్ఏలకు యువ నాయకురాలు వగ్గేల పూజ ఆధ్వర్యంలో సోమవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలకు స్వయంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించి భోజనం వడ్డించారు. కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి వీఆర్ఏలు చేపడుతున్నటువంటి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి యూత్ అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలకుర్తి రవి, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పీడియాల వెంకటేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ మండల అద్యక్షులు గుడ్ల సాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిద రోజు దీక్షలను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సాయిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వంశీ, జంపన్నరెడ్డి, కురుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
టేకులపల్లి : 8వ రోజు వీఆర్ఏల చేస్తున్న దీక్షకు ప్రగతిశీల యువజన సంఘం కొత్తగూడెం డివిజన్ నోముల భానుచందర్ సోమవారం సంఘీభావం తెలిపి, మాట్లాడారు.