Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-చర్ల
అధికంగా కురిసిన వర్షాలకు నిరాసాయులైన వరద బాధితులను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని భద్రాచలం నియోజకవర్గ సభ్యులు పోదెం వీరయ్య విమర్శించారు. సోమవారం పలు గ్రామాలలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఒకపక్క వరదలు వచ్చి నిరుపేదలు నానా అవస్థలు పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు పరిహార ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ధ్వజం ఎత్తారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా మండలంలోని గోగుబాక, మామిడిగూడెం, దేవరపల్లి, కుదునూరు, లింగాల, పెద్ది పల్లి, కొత్త గట్ల, గొమ్ముగూడెం, మేడి వాయి కాలనీ, తెగడ కొత్తపల్లి, లింగాపురం గ్రామాలలో సుమారు 2000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీలో 1000కిట్లు జీటీఎస్ఎస్ఎస్ సంస్థ వారి సహకారంతో ఇవ్వగ మిగిలిన 1000 కిట్లు ఎమ్మెల్యే పొదెం సొంత ఖర్చుతో వరద బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబెర్ నల్లపు దుర్గా ప్రసాద్, జడ్పీటీసీ ఇర్ప శాంత, ఎంపీపీ కోదండరామయ్య, ఎంపీటీసీలు మడకం పద్మజ, కుంజా నాగేశ్వరరావు, ఆదిలక్ష్మి, సర్పంచ్లు, జీటీఎస్ఎస్ఎస్ సంస్థ మేనేజర్ రామారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయ్ భాస్కర్ రెడ్డి , బండారు రామకృష్ణ, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.