Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక చైతన్య యాత్రలు జయప్రదం చేయండి
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- ఖమ్మం
సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం పనిచేసి అమరులైన త్యాగమూర్తులను స్మరించు కుంటూ ఖమ్మం జిల్లావ్యాప్తంగా మంగళవారం నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య యాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహిం చాలని ఖమ్మంరూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో ప్రారంభమై ఖమ్మం జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి ఉత్సవాలు ముగింపు సభ ఉంటుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని చేతివృత్తిదారుల కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బోడపట్ల సుదర్శన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మంగళవారం నుండి 18 వరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అమరుల యాదిలో పేరుతో జిల్లా వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నమన్నారు. కల్లుగీత కార్మికులు గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరులు ధర్మబిక్షం, బైరు మల్లయ్య లాంటి నాయకుల గురించి నేటి తరానికి తెలియజేస్తామన్నారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, అంబేద్కర్ లాంటి సామాజిక నాయకులు, సంఘసంస్కర్తల జీవిత విశేషాలను వారు చేసిన సేవలను ఈ తరానికి అందిస్తామన్నారు. ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం పోరాడి సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో దోపిడి, పీడనకు వ్యతిరేకంగా పోరాడి శ్రామిక రాజ్యం స్థాపనకు కృషి చేస్తామన్నారు. రాక్షసుల నుండి తాటి వన సంరక్షకుడిగా తాటి వనాలను కాపాడిన కాటమయ్య (కంఠమహేశ్వరుడు) చరిత్రను జానపద బహుజన సామాజిక విప్లవ వీరులను యాది చేసుకుంటూ కల్లుగీత కార్మికులని రాజకీయాలకతీతంగా ఐక్యత పరుస్తూ ఐక్యతగా సమస్యలు పరిష్కరించుకోవటానికి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి అంజయ్య మాట్లాడుతూ మద్య నిషేధం దశలవారీగా అమలు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన వారికి గత నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వడం లేదని వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మొక్క నాగేశ్వర రావు, మరికంటి శ్రీను, రెడ్డి మల్ల వెంకటయ్య, కొండం కరుణాకర్, మోటపోతుల వెంకటేశ్వర్లు, సొంటి వెంకటేశ్వర్లు, కొంపల్లి శ్రీనివాసరావు, నాయుడు రవి, పోలబోయిన నరసింహారావు, సొంటి వెంకటేశ్వర్లు, బుర్ర రామారావు, ఆలూరి కోటయ్య, జలగం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.