Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరజీవులు హరికిషన్ సింగ్ సూర్జిత్, కె.కృష్ణమూర్తి వర్ధంతి సభ
నవతెలంగాణ-కొత్తగూడెం
12 ఏండ్ల వయస్సులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేసి, లాఠీల దెబ్బలు, బుల్లెట్ల మోతల మధ్య బ్రిటిష్ జెండాను తొలిగించి జాతీయ జెండాను ఎగరేసిన ధీరుడు హరికిషన్ సింగ్ సుర్జీత్ అని, వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపక నేత, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడిన ధీరుడు కాలం కృష్ణమూర్తి అని సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. మహానీయుల వర్ధంతి సభను సీపీఐ(ఎం) కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. కమ్యూనిస్ట్ నవరత్నాలలో ఒకరుగా నిలిచి సీపీఐ(ఎం) అఖిల భారత కార్యదర్శిగా తన సామాన్య జీవితన్ని ప్రజలకు అంకితం చేసిన మంచి కమ్యూనిస్ట్‌గా చరిత్రలో నిలిచారని అన్నారు. హరికిషన్ సింగ్ సూర్జిత్ ఏడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలతో ప్రారంభమైందన్నారు. దోపిడీలేని వ్యవస్థే ఆశయంగా జీవించిన చైతన్యమూర్తి కాసం అని అన్నారు. గడీల పెత్తనాలపై పీడిత ప్రజలను తిరుగుబాటుకు మేల్కొల్పిన రణధీరుడని అనారు. ఆగస్టు1న ఆ వీరుడి 9వ వర్థంతి జరుపు కుంటున్న సందర్భంలో వారి పోరాట జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. అమరజీవు లైన సుర్జిత్, కృష్ణమూర్తి జీవితాలు నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, జిల్లా నాయకులు మందలపు జ్యోతీ, అన్నవరపు సత్యనారయణ, ఎంవి.అప్పారావు, రేపకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, వీర్ల రమేష్, కొండబోయిన వెంకటేశ్వర్లు, ఉబ్బనపల్లి నాగేశ్వరావు, డి.వీరన్న, సందకూరి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.