Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
- ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
ఈ నెల 9వ తేదీన పవిత్ర మొహరం పండుగను పురస్కరించుకొని పీరీలను ఏర్పాటు చేసే ''ఆశుర్ ఖానా''ల వద్ద సౌకర్యాలు కల్పించాలని జిల్లా మైనారిటీ జిల్లా అధ్యక్షులు యండి యాకూబ్ పాషా సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్‌ను కోరారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాలలో వక్ఫ్ బోర్డు పరిధిలో 76 ''ఆశుర్ ఖానా''లు ఉన్నాయని కులమతాల అతీతంగా నిర్వహించుకునే మొహరం పండగను హిందూ ముస్లింలు వేడుకగా చేసుకుంటారని ఇట్టి ఆశుర్ ఖానాల వద్ద శానిటేషన్, మంచినీరు, వీధి దీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. అదేవిధంగా ఆశుర్ ఖానాలను నిర్వహిస్తున్న ''ముతవల్లి (ధర్మకర్త)లను పిలిచి సమావేశాన్ని నిర్వహించాలని, ఆక్రమణలకు గురిఅయిన ''ఆశుర్ ఖానా''ల స్థలాలపై విచారణ చేపట్టి ఆక్రమణ దారులపై తగుచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరినట్లు యాకూబ్ పాషా తెలిపారు.